హనీమూన్ ప్రాక్టికల్స్
హనీమూన్ ప్రాక్టికల్స్
ఆమెది నాది ఓకటే బడి
ఆమె నేను చిన్నప్పుడు
ఇద్దరం క్లాస్మటెస్మే
ఆమెకి ఎందుకు నేను అర్థం కావట్లేదో
నాకు అర్థం అవ్వతలేదు సర్
కూరగాయలు తెమ్మంటది.....
బెండకాయ ఒకటి ముదిరితే
ముదిరిపోయిన నిన్ను చేసుకోవటం
నా కర్మ అంటది
ఒక దొండ కాయ పండిపోతే
పండు ముసలోన్ని చేసుకోవటం
నా కర్మ అంటది
దోసకాయ చేదు అయితే
నిన్ను చేసుకున్నాక
నా బతుకు తేపిలేని
చేదు బతుకవ్వటం
నా కర్మ అంటది
ఒక బెండకాయో, ఒక దొండకాయో
ఒక దోసకాయో పాడాయిపోతే
ఈ ముప్పై ఏండ్ల అనుభవాన్ని
ఆరడగుల విగ్రహాన్ని నిందించడం
ఎంతవరకు న్యాయం సర్
మీరు మాకు చెప్పిన చదువులు
పరిష్కరం చూపెడతలేవు
మీరిచ్చిన సలహాలు,గైడన్స్ లను
ఆవిడ గంగలో తొక్కేసింది సర్
అందుకే......
ఆ కురికులాన్ని మార్చి
కుటుంబం, భర్త, భార్య
సంసారం, సమాజం, పిల్లలు
వీలైయితే పెళ్లి ప్రాక్టికల్స్ ,
హనీమూన్ ప్రాజెక్ట్స్,
సంసారం ఇండస్ట్రియల్ టూర్లు,
ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు
ఆరునెలల అప్రెంటిస్ లాంటివి పెట్టండి సార్
పెద్ద చదువులు చదివి
బుర్రలో బుక్స్ పెట్టుకొని
పిహెడి చేసి వస్తే
మూడు మూళ్ళ తరువాత
మూడు రాత్రులకే
ముప్పయి సంవత్సరాల జ్ఞానం
సిగ్గుతో సచ్చిపోతుంది సర్
లేకుంటే
అది ఏమి చదవకున్న
నా మీద యూనివర్సిటీలో
ఒక వీసీ, హెచోడి, డీన్ లాగా
డామినేట్ చేస్తుంది సర్
సిరియస్ గా చెబుతున్న
రానున్న రోజులలో
ఆడవారిని అర్థం చేసుకోలేక
రోడ్లమీద జెండర్ ను మార్చుకొని
తిరుగుతుంటారు చూడండి సర్
ఓ కంప్యూటర్ సర్!
దాని మెదడులో దేవుడేమన్న
అదనపు సిలికాన్ డిస్ట్రక్ట్ చిప్
పెట్టాడేమోనని నా అనుమానం సర్
దయచేసి ప్రేమ అంటివైరస్ తో
తొలగించి నా డెస్క్ టాప్ నాకు ఇవ్వండి సర్
ఏంటి మీ డెస్క్టాప్ కూడా ఇంతేనా సర్..
మీరు సూపర్ సర్, ఎంత బాగా నటిస్తున్నారు
ఇగ చూడండి, నేను కూడా ఎంత బాగా నటిస్తానో..
అలా.....
నటిస్తూ ముందుకు తీసుకెళ్లడమే
సంసారంలో సం'సారం'
లేదంటే నీ బతుకే 'నిస్సారం'.....
