STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Others

3  

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Others

ఆశల ఘోష!

ఆశల ఘోష!

1 min
150


ఆశా... ఆశ.. ఆశ!

రేపటి కోసం ఆశ


మానవుడి మదిలో..

ఎల్లపుడు మెదిలే...మణిపూసా


మెదడుని కెలికే..

మసాలా దోశ..


కనురెప్పలు వేయనీయని..

అపురూప లావణ్య రాశా


నోటిని ఊరించే...

నారింజ జ్యూసా


నాలుకని జివ్వున తాకే..

వేడి వేడి..సమోసా


తనువును తాకే...

తళుకుల తమాషా


చేతులు చాపించే...

చిల్లర పైసా


కాళ్లకు పని చెప్పే...

కవ్వింపు ల హంసా


ఓ..ఆశా!

నిన్ను పొందేందుకు..పడతాం

ఎంతైనా...హింస


నువ్వు తీరకుంటే ఉండదు

మాకు కులాశా!

నీకోసమే తపిస్తున్న

ఓ...నా ...మనసా!

ఇక చాలించు..

నీ ఆశల ఘోష


ఆశ పై...ఆశతో..

ఆగిపోయెట్టుంది...నా శ్వాస!

ఓ..ఆశా

నిన్ను ప్రతి జీవరాశి లోనూ చూశా

కానీ..

నిన్ను పొందాలనే దురాశ మాత్రం

ఒక్క మానవుడు లోనే... చూశా


ఆశ ఉండాలి... హమేషా

కానీ!

అది దురాశ అయినపుడు

అంతా...వ్యర్థ ప్రయసా!


     .....రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Comedy