STORYMIRROR

Kalyani B S N K

Drama

4  

Kalyani B S N K

Drama

తొలి నేస్తం

తొలి నేస్తం

1 min
333

మెలకువలో విప్పారిన కళ్ళు

దేనికోసమో వెతుకుతున్నాయి..

నిన్నటి రాత్రి కనురెప్పలు తొలిగా మూత పడకముందు 

నన్ను ప్రేమగా నిమిరిన చేతుల కోసమో..

నా చిట్టిబొజ్జ ఆకలి తీర్చడానికి

అమ్మ నా నోటికందించిన చనుబాల కోసమో..


సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ

అసలు పరిచయం లేని నాకు

అమ్మ వెచ్చని కౌగిలి ఒక గాఢ సుషుప్తికి సంకేతం..

ఇక అమ్మ అదిరిపాటు కదలికే ఉషోదయం


అమ్మ చిరునవ్వు వసంతం

ఆమె నిట్టూర్పు గ్రీష్మం

కంటి కన్నీరు వరద భీభత్సం

కనుపాప వెలుగే శరత్కాల రజనీగంధం

ఆ చల్లని చూపు అదే హేమంతం

అమ్మ కలత చెందే సమయం నాపాలి శిశిరం

తానే కదా నా తొలినేస్తం


ఇదిగో చల్లని ఆ స్పర్శ..

ఇక నా కేరింతలో ఆమె పులకింత.



Rate this content
Log in

Similar telugu poem from Drama