పోరాటం
పోరాటం
పోరాటం తప్పనప్పుడు వెనుకడుగు వేయకు,
పరులెవ్వరో వస్తారని వేచి వేచి చూడకు!
పట్టుదలను వదిలేసి పాశుపతం వెతకకు,
పరిశ్రమను విరమించి పరిస్థితిని నిందించకు!
పుష్పించని బంధాలకై పదే పదే చింతించకు,
ఫలితం లేని వేదనలో మదిని చిదిమేయకు!
ప్రతీ నిమిషం విలువైనదే వృధా చేయకు,
పనికిరాని స్పందనలతో కాలాన్ని ఖర్చు చేయకు!
పూల దారి కాబోదు ప్రతి పయనం నీకు
ప్రతిఘటించే ముళ్ళే మైలురాళ్ళని మరువకు!
ప్రతీ అనుభవమొక పాఠమే జీవిత పరీక్షకు,
ప్రయోజనం తెలుసుకుని సాగిపో ముందుకు!
పరిహసించిన వాళ్ళెప్పుడూ ప్రేరణలే నీకు,
ప్రగతి బావుటా ఎగిరనాడు ప్రేక్షకులే తుదకు!
