ఆలోచించు
ఆలోచించు
చావు దేనికి పరిష్కారం కాదు.
సమస్యలు తీరవు.
బాధలు తగ్గవు.
అలానే ఉంటాయి.
అవే రోజులు మారవు ఏ నాటికి..
నువు పోయినంతా మాత్రాన
వచ్చిన సమస్యలు తగ్గిపోవు.
అన్ని అలానే ఉంటాయి.
నువ్వే ఉండవు అంతే
చనిపోతే ఏం మారదు.
నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు ఏడుస్తారు.
ఉదయం రాత్రి ఆగిపోదు నువ్వు లేకుంటే.
అన్ని జరుగుతాయి ఏవి ఆగవు ఎవరికోసం.
బ్రతుకు ఏం మారదు కొత్తగా.
అవే సమస్యలతో పోరాటం.
అవే అలోచనలతో సతమతం అవ్వడం.
ఎవరి తలరాతల్లో మార్పు రాదు.
చావు పిరికి చర్య.
ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడు.
ఏదో రోజు జయిస్తావు జీవితాన్ని ఏదో రోజు.
చచ్చిపోయి పిరికివాడిగా మరిపోబోకు
జీవిత గమనం లో.
