ప్రేమ పరుగులు
ప్రేమ పరుగులు
పరుగులు తీసే పరువమా
అందని అకాశంలా వుండబోకుమా,
మౌనభాషల్లో కంటిబాసల్లోని
ప్రేమను చదవుమా.
కలవరింతల కాలాన్ని
పులకింతల మనసుకు చేర్చుమా,
తోడుకోరే హృదయం జీవనరాగం వినుమా,
అతిధిగా వచ్చే అనుబంధం కాదూ
జతగా సాగేటి అభిమానధనం దరికి చేర్చుమా,
అందాల గంధాల ఊహల్లో విహారానికి
గమ్యం చూపుమా.
హద్దులే మోజుపెంచితే
నిదురనే నిదురబుచ్చుతుంది హృదయం,
సరసాల సరదాలు
అందమైన వలపుగా మారితే
చూపుల వేడి
చదవదా పెళ్లిమంత్రం,
అనురాగ భావం
మదిలోన నిలిస్తే
వయ్యారపు విన్నపం
చేయదా అధరం మధురం,
వాంఛలన్ని మమతలైతే
పరుగులు తీసే కోర్కెల గుఱ్ఱం
అవ్వదా ప్రేమ పావురం.
