STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ఎవరూ రారు

ఎవరూ రారు

1 min
7

ఏమో గుర్రం ఎగరావచ్చు

ఇలా చెప్పే ఆ బిట్ కాయిన్స్ కొనిపించావు

అంతకు ముందు వస్తువులు అమ్మించావు

అలా చెప్పి ఇలా చెప్పి

చేతిలో ఉన్న డబ్బుల్ని మార్కెట్లో పెట్టి

ఎవరో ఏదో చేస్తారని


ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని

ఇలా ఇరికించావు

అంతరాత్మను అంటావ్ కానీ

కొంచెం కూడా తెలివి లేదాయె

అంత ఈజీగా డబ్బులు వస్తాయంటే నమ్మడమే..


కొంచెం ఆలోచించి

ఆ డబ్బులు నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది

పొదుపు మదుపు ఉండాలి

కానీ


నీకు ఏదవసరం

ఏడవకుండా

అంటే పక్కనోళ్ళ మీద పడి ఏడవకుండా ఆలోచించు

నీకేది ముఖ్యమో

అది తెలుసుకో

కృషి చేసి గెలువు


ప్రయత్నం చేస్తే వచ్చే ఫలితం

చేయకుండా చెప్పే సాకుల కంటే 

మంచిదనే అనుకో

ఎవరూ రారు

నీకోసం ఎవరో వస్తారని

మళ్లీ అవే ఆలోచనలు చేయకు


నీరసపు నిస్తేజపు నిన్ను

కొత్త నువ్వుగా మారిన వేళ

ఆ రోజును సృష్టించు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract