STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ఈ నగరానికి..

ఈ నగరానికి..

1 min
11

ఇక్కడే ఉన్నానా

కళ్ళు అలసిపోకుండా

కలలు కంటూ 

చూసిన ప్రదేశాలను

మళ్లీ చూడాలి అనిపించేంత


సముద్రం నీరు రంగు మారేటప్పుడు

నీ జ్ఞాపకాల్లో

కొత్త రంగు చేరినప్పుడు

మసక వెలుతురులో

కలవని వెన్నెల రాత్రులు

బీచ్ లో ఆడుకొనే సమయం


అలా నడుస్తూ

కబుర్లు కరిగించి

అన్ని రోజులూ ఏదో పండుగలా

ఉన్నన్ని రోజులూ

ఏదో బిజీగా


నిద్ర లేవగానే

ఇష్టంగా పెట్టే పరుగులు

నిద్రపోయే ముందు 

రూఫ్ టాప్ గార్డెన్ లో వేసే అడుగులు


కొండలు

పడవలు

వాటిని అందంగా చూపించే సూర్యోదయాలు

కామెడీ ప్రోగ్రాములు

ఆధ్యాత్మిక అనుభవాలు


అమృతవాహినిలా ఆదరించిన ఆలయాలు

నను ఇష్టంగా హత్తుకుం

ది విశాఖ

ప్రేమతో నడిపింది ఓ బాట


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract