నాతోనే అంతం
నాతోనే అంతం
పల్లకీలో కూర్చున్నావు నీవు
పాడెపై పడుకోపెట్టారు నన్ను
పూలతో నిన్ను అలంకరించారు
పూలని నాపై పరిచారు.....
అలంకరించుకున్నానీవు
అలంకరించారు నన్ను
నలుగురిలో కూర్చోబెట్టారు
నలుగురు మోసుకెళ్ళారు....
గమ్యంవైపు పయనం నీవు
తుది మజిలీకి చేర్చారు నన్ను
"color: rgb(0, 0, 0); background-color: rgb(255, 255, 255);">ఆనందంతో కేరింతలు అందరు
రోదనలతో ఇక్కడ కొందరు....
పురోహితుని మంత్రాలు వింటూ నీవు
కాటికాపరి కాలుస్తున్నాడు నన్ను
నిన్ను అక్షింతలతో ఆశీర్వదించారు
నన్ను ఆశ్రువులతో సాగనంపారు....
బంధాలకు బానిసవు నీవు
బంధవిముక్తున్ని చేసారు నన్ను
జీవితం వైపుకి నీది పయనం
నాతోనే అంతం జీవితం....