మరణం
మరణం
మరణం మంచిదె బాధపెట్టకా తీసుకు పోవాలి
మరణం మంచిదె కలతపెట్టకా మోసుకు పోవాలి
ముందో వెనకో తప్పదు మనిషికి అంతిమ ప్రయాణం
మరణం మంచిదె అశ్రు నయనాలను తుడుచుకు పోవాలి
బ్రతికున్నప్పుడు అందరి హృదిలో నీవే నిలవాలి
మరణం మంచిదె శిలాక్షరాలను చెక్కుకు పోవాలి
ఎందరొ పుట్టిన కొందరె ధన్యులు లోకంలొ "చల్లా"
మరణం మంచిదె కీర్తిశిఖరాలు ఎక్కుతు పోవాలి
ఆఖరివరకూ బాధలతోనే బందీ చేయకు దేహాన్ని
మరణం మంచిదె చికిత్సలెన్నో తప్పుకు పోవాలి