STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ఒక రహస్యం

ఒక రహస్యం

1 min
148

ఏదో పాత సినిమాలోలా

అతను గుహ లోపలికి వెళ్ళాడు

అంధకారం అగ్గిపుల్ల వెలుతురును కమ్మేసింది

టార్చ్ లైట్ బ్యాటరీ అయిపోయింది


తచ్చాడుతూ తిరుగుతూ

గుహ నుండి వెనక్కి రావాలని నడిచాడు

రాళ్లు అడ్డుగా ఉన్నాయని కన్నీరు కార్చాడు


బయట నుంచి నవ్వులు

నవ్వుల వెనుక నిజాల మెరుపులు

చేతికందిన రాయితో గుహ గోడను కొట్టాడు

నవ్వులు ఆగాయి

కొద్దిగా వెలుతురు వచ్చింది


ఏదో ప్రతిబింబం

అక్కడక్కడే ఉంది

తనలాంటి మనిషే

ఎవరో అటు వైపు ఉన్నారు


అరిచాడు

చేతులు ఊపి సైగ చేశాడు

ఒక్కో రాయి పగులగొడుతూ 

అటు వైపుకు వెళ్ళాడు

అక్కడ ఏదో గెలిచిన ఫీలింగ్ కలిగింది

ఎవరూ లేకున్నా ఏదో భ్రమ తొలగింది


మళ్లీ గుహలోకి వచ్చాడు

ఇక బయటికి వెళ్ళాలని అనిపించలేదు

తనలో ఉన్న మరో వ్యక్తి

ఇక ఎన్నడూ కనిపించడు 

రహస్యం పాతిపెట్టిన తరువాత

అతను నవ్వుకున్నాడు 

వెలుపలి ద్వారం కనిపించింది

నడుస్తూ బయటికి వచ్చాడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract