వెలుగుల దీపావళి
వెలుగుల దీపావళి
వేయి వెలుగుల దీపావళి
దివ్వెల మధ్యన నేను
చీకట్లు పారద్రోలుతూ నీవు
మరో దీపం
మరో ఆలోచన
మరో నువ్వు
మరో నేను
ఇంకెన్నాళ్ళు అదే తలచుకుని
ఒకరినొకరం అసహ్యించుకుంటూ
ద్వేషాన్ని జీవింపజేస్తూ
ఇలా ఉండాలి
అందుకే
మళ్లీ మనం కలిసిపోవాలి
నేను ప్రమిదలా
నీవు ఒత్తిలా
ఒకరినొకరు అల్లుకుని
ప్రేమ దీపమై
అనురాగ గోపురమై
ఒక కొత్త జీవితం కోరాలి
నేను సిద్ధమే
మళ్లీ కార్తీకం వచ్చింది
నీదే ఆలస్యం
ఇవతలి ఒడ్డుకు వచ్చెయ్
పోజు కొట్టకు
నీకూ రావాలనే ఉంది
నాతో కలిసే వెలగాలని
దీపావళి జరుపుకోవాలనీ లేదూ..
