ఆరడుగుల స్థలం
ఆరడుగుల స్థలం
వెలుతురు అలుముకునే మదిలో
చిరునవ్వు ఉదయించే కనులలో
మోము అంతా నిండిపోయే రంగుల హరివిల్లుతో...
కారణం... ఏంటో....
నీకు తెలుసుగా...
అడుగులు కలిపాము ..
ఆప్యాయతలు పంచుకున్నాము...
తనువు, తలపు ఒక్కటయ్యాయి ...
ఆరడుగుల స్థలంలో కలిసిపోయేవరకు.
