అమ్మ
అమ్మ

1 min

352
నీ చేతి గోరు ముద్దలతో,
నీ లాలి పాటలతో,
నీ అనురాగాలతో,
నీ ప్రేమతో,
నన్ను మైమరపించావు అమ్మ.
నా బాధలను పంచుకునేది నువ్వే,
నేను కష్టాలలో ఉన్నప్పుడు ఓదార్చేది నువ్వే,
నా ఆనందాన్ని కూడా పంచుకునేది నువ్వే,
నా ఆటపాటలను ఆస్వాదించేది నువ్వే,
నన్ను మంచి నడవడికలోను నడిపేది నువ్వే...
అమ్మ నువ్వంటే నా కిష్టం,
నేను ఎప్పుడు నీకు కలిగించను కష్టం,
నేను నీ బిడ్డగా పుట్టడం నా అదృష్టం,
నీ ప్రేమని పొందక పొతే అది నా దురదృష్టం.
నువ్వేనా సర్వస్వం అమ్మ,
నువ్వే నా జీవితం అమ్మ,
నువ్వు లేకపోతే నా జీవితం వ్యర్ధం అమ్మ,
నువ్వే నా ముద్దుల అమ్మ.