స్త్రీ
స్త్రీ


మమతను పంచే ఓ మహిళ,
ఇంటికి దివ్వె లా కాంతి ఓ ఇంతి,
పలుకుబడి తో ఎదుటివారిని ఆకర్షించే గొప్ప
శక్తి కలిగినది పడతి,
మధుర గీతాలు ఆలాపించే ఓ గొప్ప మగువ,
నాటి నుంచి నేటి దాకా ఒక ఆదర్శమూర్తిగా
నిలిచిన ఓ గొప్ప నారీ,
కోమలత్వానికి మారుపేరైన ఓ కొమ్మ,
ఊయల ఊపుతూ తన బిడ్డకి జోల పాడే ఓ ఉవిద,
జాలిని మదిలో నింపుకున్న ఓ జాణ,
భారమైన పనులను కూడా బాగుగా చేసే ఓ భామ,
నీకు నా వందనాలు.