Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

నీ కోసమే ..!

నీ కోసమే ..!

1 min
386


నీ కోసమే నే వేచియున్నా !

కనులలో

కమ్మని కథలే చూడాలని ఎదురుచూస్తున్నా !

నీ కోసమే నే వేచియున్నా !

నీ కనులలో

కమ్మని కథలే చూడాలని ఎదురుచూస్తున్నా !



అనుక్షణం నీ నవ్వుతో నను మురిపించి

అమావాస్య చీకటినే ఇంతలో తలపించి

కనుమరుగయ్యావే నా శశీ !

ఏమైపోయావే ఈ నిశి !


ఎలా ఓపనే నీవులేని ఈ విరహం ?

ఎంత కఠినమో తెలుసా ఈ సమయం ?

నీ కోసమే నే వేచియున్నా !

కమ్మని కబురులకై నే ఎదురుచూస్తున్నా !

పగలంతా నీవేమో నీ గూటిని వీడే గువ్వవే .

నీ ఆశకు శ్వాసవౌతావు నీ ఆనందం నీదనే !

సూర్యుడినే పంపించి , సాయంత్రం ఏతెంచి

నను నేస్తాన్నే చేస్తావే . నాలో నిన్నే చూస్తావే !



నీ కోసమే నే చకోరినై తలపుల వాకిట్లో వేచియున్నా !

కమ్మని కబురులకై ఎదురుచూస్తున్నా !

ఏమైంది ఈ వేళ ? కాళరాత్రినే చూడాలా ?

ఇది గ్రహణమా ? ఒంటరితనమే నాకిక శరణమా ?

ఓ పవనమా ! నీవైనా ప్రియ జాడను తెలుపుమా !

ఉరిమే మేఘమా ! వానను కాస్తంత ఆపుమా !

ఆగని ఓ కాలమా ! నీవైనా మమ్ము దరిజేర్చుమా !


నీ రాక నాకొక శుభఘడియ !

ఎప్పుడొస్తుందో ఏమో నా విన్నపాన్నే కాదనక !

కనులు కాయలే కాస్తున్నా ,

నీకోసమే ఆతృతగా నేనెంతో నిరీక్షిస్తున్నా ..!!



Rate this content
Log in

Similar telugu poem from Thriller