నేను
నేను
నేను విలువిద్యను
అభ్యసించిన ఆజానుబాహుడను .
నీకు విహారయాత్రలో
మంచి రక్షణ కల్పించగలను .
నేను బృందావనంలో
గోపికల నడుమ విహరించువాడను .
నీకు మురళీగానంతో
వీనులవిందు చేయగలను .
నేను ఆంధ్రదేశంలో
విశ్వవిఖ్యాత కథానాయకుడను .
నీకు అద్భుత నటనతో
కళాసేవలో సరిజోడు కాగలను .
నేను భారతావనిలో
ప్రజల అభిమాన నాయకుడను .
నీకు విదేశీపర్యటనల్లో
అందచందాలను చూపించగలను .
నేను ప్రపంచస్థాయిలో
గుర్తింపు పొందిన క్రీడాకారుడను .
నీకు గొప్ప ప్రదర్శనతో
పేరుప్రఖ్యాతులను పంచగలను .
