STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Inspirational Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Inspirational Thriller

స్మార్ట్ ఫోన్...ఎం మాయ చేసావే

స్మార్ట్ ఫోన్...ఎం మాయ చేసావే

1 min
547

నీవు ఏం మాయ చేసావే

ఏందరి మనసులు దోచేశావె

నిన్ను లైక్ కొట్టని వాడే లేడు

నిన్ను తాకని చెయ్యే లేదు

కామెంట్లకు కొదవే లేదు

లవ్ చేయని మనిషే లేడు  


అలారంతో హాయి నిదురని పోగొడుతావు

నీ రింగ్ టోన్ తో నిశ్శబ్దన్నీ అల్లరి పెడతావు

నీ వైబ్రేషన్ తో వళ్ళంతా ముళ్లేక్కిస్తావు

సాఫ్టుగా టచ్ చేస్తే, రాత్రి ఫ్లాష్ లైట్లో

నా ఒళ్ళంతా తడిమి చూసి, 

నన్నే మరిపించే...స్తావు .....     


నా నవ్వుల ఫొటోస్ ని బందిస్తావు

నా ముఖాన చిరునవ్వులని పూయిస్తావు

నా జ్ఞాపకాలను బద్రపరుస్తావు

నా గతాన్ని పదే పదే చూపించి 

నన్నే పరేషాన్ చేసి మాయం చేస్తావు  


నిన్ను చూస్తుంటే ఆకలి వేయదు కానీ

నిన్నే తినేయలని ఆశగా ఉంటుంది

నిన్ను చూస్తుంటే నిదుర ఎలా వస్తుంది

నా ఊహలకు ......

రూపం ఇవ్వాలని కోరిక కలుగుతుంది

నీవు నా కళ్ళకు చూపించే ప్రపంచానికి

నా మనస్సు వింత అనుభూతికి లోనవుతుంది


నేను కూర్చున్న చోటనే అద్భుతాన్ని పుట్టిస్తావు

కావాలంటే ప్రపంచపు ఏడూ వింతలను 

నా ఒడిలోకి తీసుకుని వస్తావు

విశ్వం వింతలల్లో నీవు ఒక విచిత్రమైన వింతవు


ఏడుస్తున్న పసి పాపలకు ఆయాగా మారిపోతావు

స్కూల్ పిల్లలకు తరగతి గది అవుతావు

కాలేజీ స్టూడెంట్స్ కి లెక్చరర్ లా లెసన్స్ చెబుతావు

గురుదేవులకే నీవు ఎన్ సైక్లోపీడీయావు

అంతర్జాలంలో అందరిని మాయచేస్తావు

మాంత్రికుడివోలే మనసును వశపరుచుకుంటావు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance