చెలికాడికిఋతువులనీరాజనం
చెలికాడికిఋతువులనీరాజనం
శరదృతువు వెన్నెలవై నీ చూపుల కాంతితో
నా మేని లేలేత అందాలపై సోకి తాకావు
అందుకే కాబోలు చైత్రమాసంలో నా సోకులన్ని
ఇంద్ర ధనస్సు లా విరగబుసాయి
నాలో నులివెచ్చని కోరికలు చిగురించాయి....
హేమంత ఋతువులో నీ రాక కోసం
పరిమళించిన మరు మల్లెల వాసన
సిగ్గులతో మంచు బిందువులను
కప్పుకు ముడుచుకున్న పుష్యమీ పుష్పాలు
నీ కోసం పసుపు, నారింజ, ఎరుపు, నీలం రంగులతో హొయలు ఒలుకుతూ నీరాజనం పలుకుతున్నవి
ఆషాఢ మాసపు గోరింటాకుతో
నా మనసంతా ఎర్రగా కైపెక్కింద
ి
నవదంపతులకు నిషిద్ధ ఆచారమును
నాకు సదాచారమే
నిరీక్షణ పుణ్యకాలం పూర్తవ్వక ముందే
తొలి ఏకాదశి నాడు పాల కడలిపై పవళించవా
మాఘ మాసం సరిగంగా స్నానాలు చేసి
గుభాళించిన గులాబీల సౌరభాలలో
కోవెలలో దీపాలు వెలిగించి కార్తీక పూర్ణిమా
రాత్రిలో మిల మిల మెరిసే తారకల మధ్య
సంద్రం అంచున సూర్యుడు ఉదయించని
ప్రేమ సామ్రాజ్యంలో శివార్చనతో
అర్ధనారీశ్వరూడిగా అవతారిద్దం...