Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravi Sarma

Thriller

5.0  

Ravi Sarma

Thriller

నీతో నేను

నీతో నేను

1 min
407


బాల్యపు బుడిబుడి నడకలు ,

బడిలో దిద్దిన అక్షరాలు .

పుస్తకాలు , వాటితో కుస్తీలు

మనకు భలే జ్ఞాపకాలు .

కళాశాల చదువులు

వలపు పిలుపుల చిగురుటాకులై

మైమరపింపజేస్తుంటే ,

మనల్ని మనం వెతుక్కుంటూ పెరిగాం .

వయసుతో వచ్చిన సొగసు 

అనే పరిమళం , ఉద్రేకం 

తోడు కావాలంటే తుమ్మెదనై వాలా .

నీ కళ్ళు నాకళ్ళతో మాట్లాడుతుంటే ,

నీలో కలిగిన సిగ్గు , నా ఉత్సాహం

మనల్ని మరింత దగ్గర చేసె .

నీ మోము నన్ను అలరించగా ,

అధరాలు మధురామ్రృతాన్ని ఒలికించె .

నీ కాలి అందెలు నా హృదయవీణను మీటగా ,

మేని వగలు , ముంగురులు

శిల్పమే నా ఎదుట నిలిచెనా అనిపించె .

వివాహ వేడుక అచ్చెరువొందించగా ,

నాటి అపురూప కలయిక నాలో నిను కలిపె .

మన రసమయ జీవితం కలిగించిన ఆనందం

ఎన్నో ఊహలను నిజం చేయగా ,

అనేక జ్ఞాపకాలు నేటికీ మదిలో మనోహరమై మెదిలె .

ఈ దేహాలు ఎప్పటికీ ఇలా ఉంటే ఎంతో హాయి !

ఒక్కసారే విశ్రమిస్తే మరెంతో హాయి !!

*** *** ***



Rate this content
Log in

Similar telugu poem from Thriller