వసంతంలో వాన చినుకు
వసంతంలో వాన చినుకు
ప్రేమ మిథ్య అని తెలిసి
రోజూ ప్రేమ కోసం వెతికి
సినిమాలు చూసి
రాగాలు తీసి
నేను ఏడుస్తుంటే
ఫూటుగా అరకోడి తిని
బ్రేవ్ మని త్రేన్చి
పూటకో మాట మారుస్తూ
నువ్వు సుఖపడుతున్నావ్
వసంతంలో వాన చినుకులు
పూలన్నీ తెంపినట్టు
నా నరాల్లోని ఓపికను
నీ మస్తిష్కపు మెరుపులతో
పూర్తిగా తొలగిస్తున్నావ్
ఇంకా వర్షం పడుతూనే ఉంది
పూవులు రాలి పడుతూనే ఉన్నాయి
బహుశా రక్తపు ధారల్ని చెరపడానికే కావొచ్చు
మన విచిత్ర ప్రేమకు చితి పెట్టిన విధికి
పుప్పొడుల నివాళి ఇది కావొచ్చు..