STORYMIRROR

# Suryakiran #

Romance Thriller

4  

# Suryakiran #

Romance Thriller

సంరక్షణ !

సంరక్షణ !

1 min
665

నువ్వు నేను కలిసుంటే ప్రేమ .

ఒకరికొకరి సంరక్షణే అందుకు కారణమందామా !

చలి వాన ఎండల నుంచి రక్షించేవి దుస్తులైతే

మానాభిమానాలను కాపాడేది వ్యక్తిత్వాలు .

చుట్టూ తిరిగే , కంటికి రెప్పలా చూసే స్నేహితులు .

ఆ సన్నిహితుడే మనసును పెనవేస్తే ప్రేమికుడు .

అంటే అయ్యారు కదా అలా సంరక్షకులు !

మొదటిసారి పరిచయం తెలియకనే కలిగాక ,

ఒకరంటే ఒకరు విడిచి ఉండలేమని కనుగొన్నాక

తుఫానులే రానీ , భూకంపాలే వణికించనీ

చలించనిదే ప్రేమ . ఆశలను చిగురింపజేసేదే ప్రేమ .

ఇద్దరిలో మరుజన్మకు కూడా ఊపిరే ఆ అమరప్రేమ !



Rate this content
Log in

Similar telugu poem from Romance