STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ఆత్మావలోకనం

ఆత్మావలోకనం

1 min
272

మాటల్లోనే ఎటువంటి భావాన్ని తెలిపినా !

అంతకన్నా స్పందన ఎక్కువైతే సభ్యసమాజం

అంగీకరించదుగా !

ఇంకా , ప్రేమను రంగరించాల్సిందే

హృదయాలను నేరుగా చేరుకోవాలనుకుంటే !!

అందచందాలను పొగిడి ప్రశంసలను పొందవచ్చు ,

పదుగురికి వారివల్ల కలిగే మేలును

అభినందించవచ్చు .

చూడగానే కనులు పొందే చల్లని వెన్నెలను

కీర్తించవచ్చు ,

పలుకులోని తియ్యదనాన్ని వేడుక చేయవచ్చు .

ఆత్మీయనేస్తమనిపించి , కలలోనూ ఔరా అనిపించి

పువ్వులను చూడగానే మోమున

నవ్వులు పూస్తే అద్భుతమేదో జరగబోతోందనే .

ఆ ఇరువురి ప్రేమ ఉన్నత శిఖరాలను

అధిరోహించిందనే ,

మంగళవాయిద్యాలు గుండెల్లో మ్రోగాయనే ,

శ్రేయోభిలాషులే కనిపించని దేవతలై ఆశీస్సులు

తెలిపారనే !

నాదీ అదే ఈనాటి మధురమైన కోరిక ;

నీ పెదవులచాటు మౌనం గుసగుసలాడాలని ,

మాటలే మంత్రాలుగా మన ఇరువురుని ఒకటి

చేయాలని .

పూలబాటలో నూరేళ్ళు కలసి నడవాలని !



Rate this content
Log in

Similar telugu poem from Thriller