Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

గమ్యమెరుగని ప్రేమ !

గమ్యమెరుగని ప్రేమ !

1 min
359


నేను ఓ హృదయాన్ని మిక్కిలి ప్రేమిస్తున్నా . 

జీవితంలో మధురానుభూతులకై చూస్తున్నా !

ఆ ఊహలే అనుక్షణం మదిలో మెదిలి   

గమ్యమెరుగని బాటసారినై పయనిస్తున్నా , 

కరుణకు నోచని ఒక ప్రేమపూజారినై   

తన పేరునే వేయి మంత్రాలుగా జపిస్తున్నా !


సముద్రంలో ఆటుపోటులకు గురయ్యే నీరు    

ఆవిరిగా మారి , మేఘాలుగా తేలి ఆకాశంలో .  

ఆ జలమే వర్షంగా , నేలకు కడు హర్షంగా    

ఒడిలో వడిగా గలగలా పారే సెలయేరులో !

  

రోజంతా ప్రయాణికులు వాహనాల జోరుతో    

ఆనందాలను అనుభవింపజేసే విహారంలో ,

రంగుల హంగులను పులుముకున్నవి అన్నీ    

సంధ్యవేళకు తమతమ గమ్యస్థానాలలో !

  

నాకే ఏలనో కారు చీకట్లు తొలగకున్నవి .  

ప్రేమోదయ కిరణాలు కళ్ళను తాకకున్నవి !

 

రాత్రివెంబడి వచ్చే తళతళల పగలులా , 

ఆకర్షించే నేటిపూలే నోరూరించే ఫలాల్లా . 

పాలుగారే ప్రియబాలలే రేపటి పౌరుల్లా , 

జండాపట్టుకు తిరిగేవారే గొప్పనాయకుల్లా !

 

మాలో ప్రేమ రోజురోజుకూ పరిణతి చెంది , 

మదిఎడారిలో వలపులను పూయించాలని , 

మరలిరాని పరువాలు పరవసించాలని ! 

మొర విని ఇకనైనా ప్రేమను తెలపాలని !!




Rate this content
Log in