STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

లేప్రాయపు తీయ్యదనం

లేప్రాయపు తీయ్యదనం

1 min
470

నా మది మైదానంలో ప్రేమ విత్తనాలు నాటాను

జీవ రసాల సారంతో మొలకెత్తి 

నరాలను ఆసరా చేసుకుని 

మనసంత లతల పెనవేసుకొని

కొత్త ఆశల చివుళ్ళతో తొలి పూతకొచ్చింది

పచ్చని రెమ్మల మధ్య 

పసిడి మొగ్గ అంకురించింది

ఇప్పుడు పుష్పించింది......

గులాబీ రెక్కల్లో మకరందం చిందింది

ఎర్రఎర్రని లేలేత పువ్వుల్లో

తేనెలు ఊరుతున్నాయి....


నా దేహం ఇప్పుడు వసంతం పోదరిల్లు

పుష్పించిన పువ్వుల హోయాలతో

సొగసు పురివిప్పి మయూరిలా నాట్యమాడుతుంది

పిల్లగాలి చిలిపితనానికి, చిరుగాలి సవ్వడికి 

నా ఎద పుష్ప గుఛ్చాలు వికసించి

పరిమళాన్ని పంచుతున్నాయి

లేప్రాయపు నిగారింపుల సువాసనలకు

గండు తుమ్మెదల ఝంకారములతో

ఎడతెగని పులకరింతతో కోలాహలంగా ఉన్నది

 

నా మదిలో కోరికల పక్షులు స్వరాలు సమకూర్చగా 

తనువు అణువులు కోకిలలా గొంతులు సవరించుకుని 

ప్రణయ గీతాలను రవళిస్తున్నాయి

చిన్ని చిన్ని అలకుల చిలుకలు కొరస్ పలుకుతుంటే

నిశీధి తారకలకు నా మేని మిరుమిట్లు గోలుపుతున్నది

వెన్నెలరేయిలో నా దేహ కొలనులో విచ్చుకున్న 

ఎర్ర కలువకు ఎగురలేని రెక్కలొచ్చాయి

తీరని ఆకలితో నీ రాకకై ఎదురు చూస్తున్నది

ఈ విరాజాజి విరహం, రగిలే వేదన

హద్దులేని ప్రేమతో ఆకాశమంత విరబూసింది

శూన్యమేదో నన్ను ఆవహించుకొకముందే

నీ ఆలింగనాలతో ఈ అక్షయ పాత్రలో

ఆతిధ్యం స్వీకరించు......



Rate this content
Log in

Similar telugu poem from Romance