STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Thriller

4  

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Thriller

ఓ చిరుగాలి!

ఓ చిరుగాలి!

1 min
389

యే పచ్చదనం లో పుట్టావో..

యే కొండ కోనల్లో కదిలావో

యే చెట్టు చేమల్లో పెరిగావో

తెలియదు గానీ

మా అందరి ప్రాణ వాయువు అయినావు కదా

ఓ చిరుగాలి!


ఎచట నుండి వీచెనోగాని ఈ చిరుగాలి

రోజూలా లేదు ఎందుకని?

ఈ రోజు నీ చల్లటి స్పర్శ కర్ణములందు దూరి

హృదయమునందు చేరింది..ఎవరో పిలిచినట్టు

గుండె గదుల్ని తాకుతున్న నీ చిలిపి శబ్ధం

నాలో ఇళయరాజా సంగీతాన్ని వినిపిస్తున్నట్టు ఉంది

ఈ రోజెందుకో

చిరుగాలి తాకిన చల్లబడక..నా తనువున 

చిత్రముగా చెమటలు పడుతున్నది

నా మేనుని తాకిన చిరుగాలి లో లోపల

ఏదో గుబులు పుట్టిస్తున్నది

ఓ చిరుగాలి

నేడెందుకు చెలి కబుర్లు మోసుకొస్తున్నావు

నాలో అలజడి రేపుతున్నావూ

ఆశలు రెట్టింపు చేస్తున్నావు

ఎందుకు తుఫానులా మారి

నా తనువును తడిపేస్తున్నావూ

అంతలోనే యెందుకు ఆవిరయి పోతున్నావు


ఓ చిరుగాలి

నేడేల..ఈ తీయటి గోల

కూర్చొని ఉండక ఏదో మూల

నువ్వెంత ఉసిగొల్పినా కానరాదు గదా నా బాల

ఇప్పటికే ఎక్కువైంది...చాలా

ఇక రగల్చకు నాలో విరహపు జ్వాల!


         ......రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Classics