STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ప్రేమరాగం !

ప్రేమరాగం !

1 min
334

నీవు పూరెమ్మవు . కదిలే బొమ్మవు .

మొత్తంగా ముద్దులొలికే ఓ జాబిలమ్మవు .

దారిమళ్ళి భూమిపైకి వచ్చావు .

నిను చూసినవారిని కనులార్పనివ్వవు .


నీ నవ్వులో సరిగమలు పలుకు ,

నీది హృదివీణను మీటు కులుకు .

మాటల్లో మేలిమి ఆంధ్రాచెరకు ,

విహరిస్తే నీతో ఏ ఊరైనా అరకు .


వేయిపేజీల ప్రేమలేఖోయ్ నీ రాక ,

అందు పదములు మనభాషకే కేక .

ఎగిరివచ్చినట్లే ఒక పచ్చనిరంగు కోక ,

అడుగడుగులో కలిగి నెమలీక .


ప్రియరాగానివై , నయగారానివై

నా దేహానికి ప్రాణం అంటే నీవై ,

పాడే ప్రతిపాటకు భావము నీదై

ఉర్రూతలూగించు గానము నాదై !



Rate this content
Log in

Similar telugu poem from Thriller