సమయం మించిపోయింది !
సమయం మించిపోయింది !


ఆమె మనం రోజూ చూసే ఓ తెల్లగులాబీ .
మనసు విప్పి మాట్లాడిందంటే ,
స్నేహహస్తం అందివ్వబోయిందంటే
అటువంటి వర్ణనకు తగినదనే !
నాలో ఏమి నచ్చిందో , నన్నే మెచ్చింది .
మనుషుల అభిరుచులు రకరకాలు కదా !
అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి
సిద్ధంగా ఉండేవాడే ఎప్పుడైనా విజేత .
ఇష్టపడి స్పందించుటలోనూ ఉంది ఘనత !
ఆ స్నేహమే జీవితమైతే మరోలా ఉండేది .<
/strong>
కనులముందు కదలిన తాను
నేడు కలలో కనిపించి ఊరించినా
ప్రయోజనం ఏముంది ?
సమయం ఆనాడే మించిపోయింది !
ఆ అదృష్టం వేరెవరి గుండెతలుపో తట్టింది .
మరలమరల ఆ తలపు నన్ను
ఇప్పటికీ ఎంతగానో బాధిస్తోంది ,
ఓ ఎర్రగులాబీ ఆ స్థానంలో మైమరిపిస్తోంది .
ప్రయత్నిస్తున్నా !
కోరుకున్నది చేజారకూడదంటున్నా !!