STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Fantasy Thriller

ఎదురు చూపుల చంద్రుడు

ఎదురు చూపుల చంద్రుడు

1 min
502

అతనొక ఎదురు చూపుల చంద్రుడు

పాడ్యమి మొదలు నా మనసులో మెదులుతాడు

దూరంగా నెలవంకలా ముసి ముసి నవ్వులతో

పంచమిలో చిరునవ్వులను రువ్వి నా నెలవంక 

నా వంక చూసి నన్ను కవ్విస్తాడు

సప్తమిలో సప్తపదులు నాతో వేస్తాడు

నవమి వెన్నెలయి నా కన్నులలో కాంతిని మెరిపిస్తాడు

దశమి జాబిలిలా నా ఆధరాలు చుంబిస్తాడు

పున్నమి రెయిలో నా దేహమును వెన్నెలతో పూస్తాడు

శుక్ల పక్షము నా అంతరంగ కోరికల అలలను సృష్టిస్తాడు

అవి తీరం చేరేవరకు మదిలో కెరటమై ఎగిసిపడతాడు


నేనొక సమాధానలా విచిత్ర సముద్రాన్ని.....

నా విరహం చిన్ని చిన్ని అలలతో తనని ముంచుతూ

దిన దిన ప్రవర్ధమానమై నా బాహువుల్లో గట్టిగా బందిస్తూ నాలో కలిపివేసుకోవాలని నన్ను నేను

తరుముకుంటు తనని తడుపుతు తడుముతూ

తన్మయత్వం చెందుతూ కృష్ణ పక్షంలో సాగిపోతాను

అనంత నిశీధి ఆకాశంలో మెరిసే చంద్రుడిని 

నా తమకంతో ముద్దాడుతూ తనలో నేను కలుస్తూ

నా యవ్వన యద లేపనాలతో తనని తాకుతూ

పూర్తిగా నిండు అమావాస్య రేయిలో ఆక్రమిస్తా

అలసట చెందని సుడిగుండమోలే నింగి అంచు 

స్వర్గపు సుఖ శిఖరాలను జ్వలింప జేస్తాను


అలా సున్నితంగా, కలిసిపోతు, విడివడుతూ, తోసుకుంటూ,నలిగిపోతు, సాగిపోతు, 

నా విరహన్నీ తన వెన్నెల చురకత్తితో 

నాలో ఎగసిపడే అలలను చీల్చి వేసి 

నా ఉదర బాగమందు మల్లి శుక్ల పక్షములో 

నెలవంకై పురుడుపోసుకొంటాడు

తన ప్రయాణం నింగిలో........

నా ప్రయాణం పుడమిపైన ......

మేము విడిపోయే సమయం పగలు

మేమిద్దరం కలుసుకునే సమయం రాత్రి

అందుకే మేము పున్నమిరేయిల అలలం

అమావాస్య చంద్రుడిలా సంగమం



Rate this content
Log in

Similar telugu poem from Fantasy