సునామీలా ..!
సునామీలా ..!
నేను ఇక్కడున్నా నీ గురించే ధ్యాస .
ఎక్కడున్నా సుఖంగా ఉండాలనేదేగా ఎవరికైనా ఆశ !
సూర్యుని రాకతో మధురంగా పలుకరించేలా
అందంగా విచ్చుకోదా తామర !
చంద్రుని చూపులతో వెన్నెలలో చేతులు చాపి
బుగ్గలు నిమరదా తెల్లని ఆ కలువ !
నాకూ అలాంటి తలపులే అనుక్షణం .
ఎదురుగా నువ్వు ఉన్నావే అనే నా కనుల వీక్షణం .
అలల తాకిడిలా అలా కనిపించి కనుమరుగయ్యే
ఊహాలోక జీవితం ఇంకా ఎన్నాళ్ళో .
దేవుడు కరుణించి మనల్ని ఒకటి చేయాలని
ప్రార్థిస్తున్నా రోజూ పరమభక్తుడనై చూసిన ప్రతిగుళ్ళో .
నేను గుర్తొచ్చి దరిచేరాలనిపిస్తే
సముద్రంలో వచ్చే కెరటంలా ఓ సునామీలా వచ్చేసెయ్ .
నీ ప్రేమలో నను ముంచేసి ఉక్కిరిబిక్కిరి చేసేసెయ్ !!