STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

నాలో దాగున్న నీవు

నాలో దాగున్న నీవు

1 min
728

నీ మాటల్లో ఎదో మాయ ఉంది

లేదంటే మూగపోయిన నా మనసుకు 

మాటలు ఎలా వస్తాయి

నీ చూపుల్లో ఎదో తెలియని శక్తి ఉంది

లేకుంటే చీకటి నా బతుకుకు వెలుగు ఎలా వచ్చింది


నీ చేతుల్లో ఎదో చైతన్యం ఉంది

లేకుంటే చలనంలేని నా తనువులో 

ప్రకంపనలు ఎలా పుట్టాయి

నీ స్పర్శలో ఎదో మంత్రం ఉంది 

అందుకే అణువు అణువు ఇలా పులకించిపోతుంది


నీ కౌగిలిలో ఏదో కరెంట్ దాగుంది

లేకుంటే నా సిరలలో ప్రేమ ఇలా పరిగెడుతుంది

నీ ముద్దులో ఎదో మహత్తు ఉంది

అందుకే నా మది మత్తులో ములుగుతుంది


నీ శ్వాసలో ఎదో తంత్రం ఉంది

లేకుంటే శిలగా మారిన నాకు జీవం ఎలా వచ్చింది

నీ కలయికలో ఎదో అలౌకిక ఆరా దాగుంది

అందుకే ప్రతీ కలయికలో అతీత ఆనందం వస్తుంది


నీ అలికిడితో నా పంచప్రాణాలు 

నీ వైపే ఎందుకు ప్రవహిస్తాయి

నా అలికిడి నీలో అలజడి ఎందుకు కలిగిస్తుంది

నీలో నాలో ఎదో మహిమ ఉంది 

అందుకే నీలో దాగున్న నా కోసం 

లేకుంటే నాలో దాగున్న నీ కోసం 

నీ నా మనసు పరుగులు పెడుతుంది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance