Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

అంతులేని ప్రేమ !

అంతులేని ప్రేమ !

1 min
373


సృష్టిలో అన్నీ కంటికి కనిపించేవేనా ?

చూడలేనివి కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే ,

వాటి పరిమితి అంచనా కష్టసాధ్యమే .

ఒకటి మనిషి అనుభవించే అంతులేని ప్రేమే .


నొప్పికి ఓర్చుకుంటే అమ్మ జన్మనివ్వగలదు ,

ప్రతిపూటా తింటే శరీరం సుఖంగా మనగలదు ;

లాలనలో , పాలనలో తనకు తానే పోటీ .

అనిర్వచనీయమైన అనుభూతి బిడ్డలతోటి .


నాన్న కృషికీ ఎన్నడూ లేదు కొలమానం !

వానిది అలుపెరుగని సమరం పిల్లలకోసం ;

అచంచల విశ్వాసం పనియందు ఉండటం ,

కర్తవ్యాన్ని సకాలంలో సరిగా నిర్వర్తించడం .


పతియందు సతికి , సతియందు పతికి ;

కుటుంబానికి ఆధారం అన్యోన్యతా బంధం .

జోడెడ్లబండిని సంసారం తలపించునే ;

సుఖమయ జీవనం సుస్వరాలాపనతోనే .


బాల్యంనుండి స్నేహంలో ఎంతో మాధుర్యం ;

కలసి విద్యనభ్యసించుటలో అభిమానం ,

ఉన్నతికి మనమధ్య చెప్పలేని సహకారం .

వ్యక్తిత్వానికీ అణువణువునా ప్రేమభావం .




Rate this content
Log in

Similar telugu poem from Thriller