Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

నీతో ఎడారిలో ..!

నీతో ఎడారిలో ..!

1 min
443


ఎడారిలో ప్రయాణం అంటే సాహసమే .

కనుచూపుమేరలో గొడుగులాంటి ఆకాశమొక్కటే .

సూర్యుడు నిశ్శబ్దంగా కురిపిస్తూ ఉంటాడు

ఏడాదిలో అది ఏరోజైనా తన కిరణాలను ,

చంద్రుడు అంతా సమానమే అని

మేఘాలచాటున దాగి హాయిగా వెన్నెల జల్లును .

కరుణించేలా శీతాకాలపు మంచుపూల శుభోదయం .

ఇంకా , మలయమారుత సంధ్యాసమయం .

అలా పర్యాటకులను ఆహ్లాదపరచే పర్యావరణం ,

ఒంటెలే ఓడలై దారిని చూపే ముఖ్య జంతుగణం .

పురుషులు పంచెకట్టు , తలపాగాలతో

అక్కడే విశేషమైన ఖర్జూరాలను పండిస్తూ ,

స్త్రీలు ఇసుమంతైనా తమ సొగసులు చెరగక

చెలమల్లోని నీటిని దినచర్యగా సేకరిస్తూ .

నీ ప్రేమకోసం కట్టనా మనం ఉండేలా

కలలను సాకారం చేస్తూ పద్మాకారంలో ఓ భవనం !

బంకమన్ను నిండిన కుండీలలో పరిసరాలను

సస్యశ్యామలం చేస్తూ పెంచనా పూలమొక్కల వనం !

అప్పుడా హరితారణ్యంలో ఎల్లకాలం చల్లదనం .

కోయిల కూస్తే మామిడి మొక్కలూ పెంచామనే ,

నెమలి పురివిప్పితే వర్షం తన రాకను తెలిపిందనే .

అందరికీ ఇలా తోస్తే ఎడారిలోనూ రహదారులు ,

ఎప్పుడూ సరదా సంతోషాలతో విహారులు ;

ప్రేమపంటలోనూ మూడుపూలు ఆరుకాయలు !




Rate this content
Log in

Similar telugu poem from Thriller