దారుణం
దారుణం
దేశమే రుణములో..మ్రగ్గటం దారుణం..!
నేతలే అవినీతి..మరగటం దారుణం..!
సిద్ధాంత పరముగా..జీవించు నియతేది..
నిస్సిగ్గుగా గోడ..దూకటం దారుణం..!
దుమ్మెత్తి పోసుకో..చట్టసభ లెందుకో..
కోట్లాట వేడ్కతో..ఆడటం దారుణం..!
సరిహద్దు జగడాలు..తీరేది ఎన్నడో..
కోటాను కోట్లు తగలేయటం దారుణం..!
ఆధిపత్య పోరులో..సమానతే కరువుగా..
న్యాయధర్మాలనే..తప్పటం దారుణం..!
