నీ వెనుక
నీ వెనుక
వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం లేదు. ఎన్నో అనుభవాలు మరెన్నో అవమానాలు. గాయపడిన మనసు. నొప్పిని భరించే దేహం. కష్టాల కడలి కన్నీళ్ల ప్రవాహం. సంతోషంగా ఉన్నా అనే లోపు బాధ అల్లుకుంటుంది. చక్ర బంధంలో ఇరుకున్నా తెలిసి తెలిసి. రాసి పెట్టి లేని అదృష్టం. అనుకున్నాది జరగదు కోరింది దొరకదు. ఎటు చూసినా వేదనల సమాహారం. నిత్యం అనునిత్యం పోరు. అన్ని మర్చిపోయి ముందుకు సాగడమే జీవితం. ఇంకొకరిని మోసం చేసి జీవించకు ఎప్పుడు. తెలిస్తే మంచి చెయ్. పాపాన్ని ముట్టుగట్టుకోకు నువ్వు వెనుకకు తిరిగి చూసుకునే సమయంలో...
