హిందీభాష
హిందీభాష
దేవనాగరలిపి తోడ దివ్యమై
రాగరంజిత సుందర మాధుర్యమై
కలకూజితానాద సమ్మిళితమై
సరసభారతీ పాద మంజీరమై
హిందీభాష పరిఢవిల్లె విజయ.
రాజభాషగా వర్థిల్లె దేశమందు
ఐక్యతాభావన చక్కగా పెంపొందు
సులభరీతిలో నేర్వగా మున్ముందు
ప్రగతి బాటలో పరిగెత్తు విజయ.//
