కలికి
కలికి
*కలికి*
(తేటగీతిమాలిక )
ముగ్ద మోములో కమలాలు పూయుచుండె
కలికి కనులలో కురిసెడి కాంతు లెగసి
చిలుకు చుండగా శోభలు చిన్నదాని
శిరసుపై జల్లి ప్రేమతో సేస లపుడు
"పెళ్ళి యెప్పుడ"టంచునా పెద్దలడుగ
చిన్న పిల్లతాన్ మురియుచు సిగ్గుపడెను.
తల్లి దండ్రులు "బంగారు తల్లి! "యంచు
పెంచుకొనుచుండి రెంతయో ప్రీతితోడ
చదువు చెప్పించి వెలదికి సమధికముగ
తగిన వరునిని వెదుకుచు తనయ కొఱకు
పెండ్లి చేయుచు బిడ్డకు వేడ్కమీర
కంట నీరును పెట్టిరి కన్నవారు.
మంచి మనసుతో మెలుగుచు మగువతాను
గృహిణిగా పొందె తరగని కీర్తినెపుడు
తల్లిగా, దారగా చాన తనరుచుండి
తీర్చి దిద్దును గృహమును దేవతవలె
దైవరూపమటంచును తల్చుకొనుచు
ప్రణతి జేయుచు తరుణిని భక్తిమీర
పొగడు చుండగా జాతికి పుణ్యనిధుల
సంపదల్ పొర్లి నిరతము సౌఖ్యమబ్బు.//
