గృహస్థుడు
గృహస్థుడు
పత్నికి జననికీ మధ్య వరలుచుండి
సకల సమస్యలన్ దీర్చు సాహసికుడు.
బాధ్యతలు మ్రోయు ధీరుడు భయమెరుగడు
భర్త యనువాడు గృహములో బంటువోలె
సేవలందించు వాడయి చింతదీర్చు
పరమ నిష్ఠాపరుడు భార్య వలపు కోరి
నగలు నాణ్యాలు కొనిపెట్టు నాయకుండు.
తల్లిదండ్రులన్ మురిపించు తనయుడగుచు
పిల్లవాండ్రను ప్రేమతో పెద్దచేయు
పురుష పుంగవుండు ధరలో పుణ్యశీలి.
తల్లి ముఖ్యమా? దారయా? తలచుకొనిన
కష్టమైనట్టి స్థితిలో గరిమతోడ
సమదర్శిగా నుండెడి శాంతుడతడు.
సహనముగ సమస్యలు గాంచి చక్కదిద్ది
పెద్దదైనట్టి తల్లిపై ప్రేమజూపి
భార్యకుననురాగము పంచు భర్తయతడు.
జాతియందున పరువుతో సాగుచుండు
సజ్జనాత్ముడౌ మనిషిని ముజ్జగములు
పొగడుచుండగ వలయును పూజచేసి.//
