ఆకలి -పేదరికం
ఆకలి -పేదరికం
తేటగీతి /
పేదరికమునకుందెడుబీదవారు
పట్టెడన్నముకోసముపాటుబడుచు
నెట్టు కొందురీ బ్రతుకును తిట్టు కొనుచు
పలకరించెడి వారేరి వసుధయందు?/
గంజి నీళ్లను ద్రావుచు గడుపుచుండి
కాల చక్రవక్రతలను కాలి పోవ
వారి కడగండ్ల కలతల బాధ తీర్చ
కరముకలిపెడివారేరి?కర్మ!'ఖర్మ'!/
సీసము /
పేద గొప్పయనెడి భేదముల్ మాన్పుచు
బాధ నొందెడి వారి భయము బాపి
ధనసహాయంబును ఘనముగా జేయుచు
పలుకు తోడుగజని బంధుమైత్రి
నిలిచియుండి జనులు నిర్మల బుద్ధితో
భుజము తట్టిన చాలు పుణ్య నిధులు
మేలు కల్గుచు నుండి మేదినిలో శాంతి
మిగిలి యుండును గదా!మిక్కుటముగ./
తేటగీతి /
సామరస్యమున్ జూపెడి జాతి మనది
దాన ధర్మముల్ జేయుచు ధరణియందు
సమసమాజస్థితినిగని జనులు కలిసి
నడుచు చున్నచో వెలుగును నవ శకంబు.//
