నా మనసే
నా మనసే
జరగ'లేదు నా మనసే..చూపలేని మత్తువీడి..!
హాయి ఎలా ఉంటుందో..చెప్పలేను పెదవి విప్పి..!
ఎటుచూస్తే అటునీవే..రంగులతెఱ తొలగిపోయె..
ఎంత వింత వెన్నెలోయి..పాడరాదు ఈ సందడి..!
మాటలేల ఓడిపోయె..భాషలేమొ మౌనమాయె..
నీ చూపుల తేనె రుచిని..పొగడలేక మూగబోయి..!
పరవశమే లేదులెమ్ము..నీ వశమే సర్వస్వము..
ఎఱుకకెంత వినోదమో..ఉండినదీ తనువుసాక్షి..!
పిలిచేపని నిలిపేస్తివి..తలచుకోగ ఏముందిక..
అలజడులే ఆగిపోయె..నీ అడుగుల సడివినబడి..!
రాగసుధా భరితమైన..కావ్యమేల ఇక వ్రాయను..
వియోగమే యోగమైన..సౌఖ్యమెంత వరమైనది..!
