పల్లె రథమా
పల్లె రథమా
మెతుకు క్షేత్రపు యుద్ధవీరునికి
శుభకర హారత్తులిద్దాము,
బాసటగా నిలిచిన బసవన్నకు
జేజేలు పలుకుదాము,
ఎడ్లబండీనే రైతురథంగా
మనసులోతుల్లో దాచుకుందాము.
పాడిపంటలతో చేరువైన సంతసాలు
వెలుగుల బ్రతుకు చిహ్నంగా చెప్పుకుందాము,
ప్రకృతికి నేస్తమైన ఎడ్లబండిని
మనసులోని మధుర రాగాలతో
కీర్తిద్దాము,
కృషీవలుని కన్నుల్లో కదలాడు
బంధానికి
అనుబంధాల విజయతిలకం దిద్దుదాము.
ప్రకృతిని పాడుచేయని
ఎడ్లబండి రవాణా
సిరివెన్నెలగా
చీకట్లను తొలిగించి పల్లె బ్రతుకున
పంచింది ఆనందము.
మారుతున్న కాలంతో మారిపోయిన రైతు
ఎడ్లబండినే ట్రాక్టర్ గా బసవడినే ఇంధనముగా మార్చుకున్న
దొరుకునా ఆనాటి ఆనందము,
సహజత్వం కానరాని జీవగతులతో తొలిగిపోవునా
శోకము,
కలతల కథల పల్లెసీమలో
పుడమితల్లి ముచ్చట్లు లేకపోవడమే విడ్డురము,
విజ్ఞానం అందించే విశ్వాసంలో
అన్నదాత తనువు తపన లేకపోవడమే శాపము,
మహి అమృత చైతన్యపు శక్తి
కావాలి పుడమిపంటలకు
ప్రేమపూల నందనమ
