అసలు
అసలు
ప్రేమలోన మునగకుండ..మనసెందుకు అసలు..!
ప్రేమగుట్టు పట్టకుండ..బ్రతుకెందుకు అసలు..!
పంచదగిన దేమిలేదు..ప్రేమవెన్న గాక..
ప్రేమనావ చేరకుండ..పలుకెందుకు అసలు..!
సమభావన వెలిగించే..గురువంటే శ్వాస..
ప్రేమసుధను పొందకుండ..పరుగెందుకు అసలు..!
విశ్వమైత్రి చైతన్యపు..విలువ అందునెపుడు..
ప్రేమనదిగ మారకుండ..చూపెందుకు అసలు..!
రాముడైన కృష్ణుడైన..పూజ్యులైరి ఎటుల..
ప్రేమనిధిగ మిగలకుండ..ధనమెందుకు అసలు..!
విశ్వమెల్ల ఉన్నదోయి..ప్రేమ అదుపులోన..
ప్రేమకాంతి గ్రోలకుండ..వాదెందుకు అసలు..
