వెలుగు
వెలుగు
తీయనైన కమ్మనైన మనతెలుగే వెలుగు
తేనెలూరె మధురమైన మనతెలుగే వెలుగు
తెలుగునేల పరవశించు గలగలమని పారె
కృష్ణవేణి తరగలోన మనతెలుగే వెలుగు
దైవాన్నీ ప్రార్ధించే అక్షరాలే తెలుగు
అన్నమయ్య రచనలోన మనతెలుగే వెలుగు
దేశభాష లన్నిటిలో అగ్రగామియె తెలుగు
దేవరాయ పలుకులోన మనతెలుగే వెలుగు
ఖండాంతర ఖ్యాతినొందు తెలుగుప్రజల గుండె
విశ్వమంత వ్యాపించిన మనతెలుగే వెలుగు
