వెన్నెలెంతో
వెన్నెలెంతో
వెన్నెలెంతో చిన్నబోయెను కన్నె మదిలో నలత చూసీ..!
మెరుపు కాంతిని మరచిపోయెను నెలత యెదలో కలత చూసీ..!
రూపు ఎంతో మారిపోయెను విరహవేదన తోడు కాగా
చూపు ఎంతో అలసిపోయెను చెలియ కథలో వెతల చూసీ,..!
వాలుపొద్దులొ మడతలెన్నో! విప్పి చూడగ చినుగు బాసలు
గమ్యమేదో తొలగిపోయెను, వెలది హృదిలో వ్యధల చూసీ....!
తరిగిపోయే కాంతి నీవను భావమే భరియించలేనిది
తిమిర సమరం తరుముకొచ్చెను..అబల కలలో మమత చూసీ..!
