సోయగం
సోయగం
వెన్నెల్లో పురి విప్పిన
నెమలి కన్యకలా..
విరిసిన మల్లెల వానలో
మైమరచి మెరిసిన సోయగాల
మనోహరి కళ్ళలో
జలతారులా కురుస్తూ..
విశ్వామిత్రుడికే మరులు గొలిపి మాయ చేసిన మేనకలా..
తొలి మంచు కురిసే
మది లోన తుళ్ళింత
కవ్వించే చెలి స్పర్శ
సెలవంది ఏకాంతం..
సిగ్గు పడుతూ వరూధిని
సిరిసిరి మువ్వలా..
మొగ్గ లేస్తూ ప్రవరుడు
ఝుమ్మంటూ ఎగిరే తుమ్మెదలా..
సోగకళ్ళ తారక
చూసింది ఓరచూపు
నా గుండెల్లో గుబులు..
తొలి ముద్దు పెట్టింది
మురిపాల ప్రేయసి..
పూ వనంలో తూనీగ
గుండె లయ తప్పింది..
చైత్రంలా మురిపిస్తూ
చీకట్లో చిరునవ్వై
శోభించే సింధూరమై
నీలి మేఘంలా నీవు
మనసు దోచేసావు..
లోకమే మార్చేసావు
ఊపిరై శ్వాసించావు..!
