నరకవధ
నరకవధ
ఖలుడు కాశ్యపేయుడు తాను గనలుచుండి
భువిని తెచ్చి యా జలధిలో ముంచివేయ
విష్ణుదేవుండు దైత్యుని వేటువేసి
ఘన వరాహ రూపముఁ దాల్చి కరుణజూప
వరదుడైనయా విష్ణువున్ వలచినట్టి
భువిని పెండ్లాడి వరదుండు మురిసిపోయె.
తల్లిదండ్రులు మధ్యలో తనయుడైన
నరకు డనువాడు చూపగా కఱకుతనము
కృద్ధుడై హరి దైత్యుని కూల్చివేయ
సత్యభామతో కూడితాన్ సంహరించె.
దుష్టు డైనట్టి తనయుని దుండగములు
కలుగ జేయగా ప్రజలకు కష్టములను
మమత వీడిన కృష్ణుడు మహిని గాచె.
పీడ వదలగ లోకులు వేడ్క మీర
పర్వదినమును జరిపిరి పరవశమున.//
