వెన్నెల లోకంలో
వెన్నెల లోకంలో
ప్రేమపంచు మనసుకన్న వెన్నెలేది లోకంలో!
చెలిమి పంచు చెలియకన్న ధూపమేది లోకంలో!
ద్వేషమంటు తెలియనట్టి మంచి మనిషికాహ్వానం!
కాగడేసి వెతుకుతున్న! జాడయేది లోకంలో!
మంచు దుప్పటి కప్పుకున్న హిమవన్నగమున్నతమే
మేకవన్నె పులి వేటకు దారియేది లోకంలో!
సహన సుఖము పొందుటెంతొ భాగ్యమేగ చూడగా,
కరుణ లేక శ్వాస మాటు ప్రాణమేది లోకంలో!
కాలమెంతొ కఠినమాయె! కలలచెంత, కాపుగాసె!
మనసులోని విరుల సొగసు గంధమేది లోకంలో!
తప్పులేక శిక్షవేయు సమాజమే నేర్పు పాఠం!
న్యాయమనగ శూన్యమాయె! వింత యేది లోకంలో!
ఎన్ని తారలున్ననేమి? చంద్రుడిచ్చే కాంతి యేది,
సుగుణ మూర్తి! నీకు మారు సాటియేది లోకంలో!

