ఈ రోజుల్లో బంధాలు
ఈ రోజుల్లో బంధాలు
విడిపోవడానికి కాదు కలసుండాలని
కారణాలు వెతుకోవాలి.
మరణం తో విడిపోవాలి.
మనస్పర్థలతో కాదు.
బంధాలో ఉండాలి నమ్మకం.
బ్రతుకు తలరాత మార్చుకోవాలి.
నీడల సాగిపోవాలి.
కసురుకోవాలి కోపాలు చూపించాలి.
సర్ది చెప్పుకోవాలి ఒకరికొకరు.
బరువు కాకూడదు ఎప్పుడు.
జీవితానికి అలంకారం కావాలి.
మది తలచుకోగానే మనసు నిండిపోవాలి.
గొడవలు వస్తాయి పోతాయి.
అప్పుడే బంధాలు బలంగా ఉంటాయి.
ఆనంద బాష్పాలు పొంగిపోవాలి.
అలుసైపోకూడదు అల్లుకోవాలి.
నిలుపుకోవాలనే ఆలోచన మదిలో
నిరంతరం మెదాలలి.
శాశ్వతం కాని జీవితంలో బంధాలు నిలిచిపోవాలి.
బంధాల పేరుచెప్పి బ్రతుకులను చిద్రం చేసి.
మోసం చేయకు ఎవ్వరిని ఓ మనిషి..
