సుందర రూపం
సుందర రూపం
మత్తేక్కించే మన్మధబాణమా,
రసిక హృదయనాదమా,
పరువపు విందుల మధురకావ్యమా,
కనురెప్పలు మూయనివ్వని
శృంగార దేవతారూపమా ,
కవ్వింతల స్వప్నసుందరి
నీ శుభాగమన విషయం తెలియచెప్పవే.
చంచల మనసుల మగబుద్ధితో ఆడుకుంటావా,
మల్లెలపాన్పుపై పవళిస్తావా,
సరసరాగ శ్రుతిలయ నీవే అవుతావా,
ప్రేమ ప్రలోభాలతో
అవసరాలు తీర్చుకుంటావా
చెప్పవే నీవు
మనసుగుట్టు విప్పవే నీవు.
కట్టుబొట్టు సంప్రదాయస్త్రీ కి
ఇచ్చు గౌరవం చూసిపోతావా,
పరుషవాక్కు వినపడని
మనుజుల చెలిమితో
అజ్ఞానపు అలంకరణ వదలివేస్తావా,
సంస్కారపు హద్దుల్లో
మేను మెరుపులు దాచుకుంటావా,
వెలకట్టలేని అభిమానం
ఆత్మగౌరవం
గుండెలయల రాగం చేసుకుంటావా,
అందానికి నిర్వచనం తెలుసుకొని బ్రతుకుమార్చుకుంటావా,
చెప్పవే సొగసరి
నీతీయని తలపుల మాట వినిపించవేమి.
తీపికిచేదుకు మంచికిచెడుకు
తేడా తెలుసుకొని సాగాలమ్మా,
ఊరించు చూపుల
దుఃఖనదిలో
ఆటలు ఆపవమ్మా,
విచక్షణ విజ్ఞతే
నీ అంతరంగ అందం కావాలమ్మా,
మనసుపలుకు భావాలు
అమృత మధుర మంత్రాలుగా వినిపించాలమ్మా,
పరమాద్భుత సౌందర్యం
అత్మాలయ క్షేత్రంగా వుండాలమ్మా,
తెలుసుకోవే సుందరి
ముక్కలైన మనసు అతకదని
గుర్తుంచుకో గడసరి.
