STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఉండనీ

ఉండనీ

1 min
2


నీ కంటి పాపల్లొ..పాపనై ఉండనీ..! 
నీ గుండె గుడిలోన..గువ్వనై ఒదగనీ..! 

జీవితం గాలిలో..స్వప్నాల వనసీమ.. 
నీ పలుకు తేనియల..ఊటనై ఉండనీ..! 

అద్దాల మేడ ఇది..అద్దెయే లేదులే.. 
ముద్దుగా నీ తీపి..ఊహనై ఉండనీ..! 

ఓ నెమలి పాముతో..ఆడేది చూస్తినే.. 
నీ మాయ ఆటలో..బొమ్మనై ఉండనీ..! 

హెచ్చుట తగ్గుటో..జరుగునా ప్రేమలో.. 
ప్రశ్నించు మనసుకే..ప్రశ్ననై ఉండనీ..! 

మరణమే తోడుగా..జన్మాల జాతరే.. 
పరువాల హరివింటి..నీడనై ఉండనీ..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics